జంతర్ మంతర్ దగ్గర నిరసన.. అడ్డుకున్న పోలీసులు
All India Students Association (AISA) నేతృత్వంలో, పౌర సమాజ సంస్థల సహకారంతో CEC జ్ఞానేశ్ కుమార్‌పై జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. AISA జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, యోగేంద్ర యాదవ్‌తోపాటు ఉద్యమకారులు పాల్గొన్నారు. “జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్ట్ చేయాలి” అని నినాదాలు చేశారు. అయితే నిరసనకు పర్మిషన్ లేదని చెప్పి పోలీసులు వారిని ఆపేశారు. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ, ఓటు చోరీ చేసినప్పుడు పర్మిషన్ తీసుకున్నారా అని ట్వీట్ చేశారు.


