← Back to news

సత్తెనపల్లిలో పేకాట క్లబ్‌పై దాడి

By siva· 1d ago
సత్తెనపల్లిలో పేకాట క్లబ్‌పై దాడి

AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో అనధికారంగా నిర్వహిస్తున్న పేకాట క్లబ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. క్లబ్‌లోని అద్దాలు, ఫర్నీచర్‌, బీరువా, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేశారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇటీవల పేకాట ఆడేందుకు వచ్చిన వారిని వీడియో తీస్తున్నారనే కారణంతో క్లబ్‌ నిర్వాహకులు కొందరిపై దాడిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.