గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

జగిత్యాల జిల్లా పోలీస్ ఆఫీసులో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఎస్పీ అశోక్ కుమార్ ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 12 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వాళ్ల సమస్యలు విన్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. బాధితులకు సత్వర న్యాయం జరగాలని ఆయన అన్నారు. ప్రజలకు పోలీస్ శాఖ మరింత దగ్గర కావాలని, ఫిర్యాదులపై ఫీల్డ్ లెవెల్‌లో విచారణ జరిపి వేగంగా స్పందిస్తున్నామని ఎస్పీ తెలిపారు.




