← Back to news

ITDA ఎదుట నిర్వాసితుల నిరసన

By MD ALI· 1h ago· Yerrampeta, Chinturu, Polavaram
ITDA ఎదుట నిర్వాసితుల నిరసన

ముంపు ప్రాంతంలో ఉన్న తమ గ్రామానికి చెందిన 104 కుటుంబాలను ముంపు జాబితాలో చేర్చలేదని ఆరోపిస్తూ పోలవరం నిర్వాసితులు ఆందోళనకు దిగారు. పోలవరం జిల్లా వీఆర్ పురం మండలం రామవరం గ్రామానికి చెందిన నిర్వాసితులు బుధవారం చింతూరు ITDA కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మిగిలిన కుటుంబాలతో పాటు తమను కూడా ముంపులో చేర్చకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలను కూడా ముంపు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.

More in Local