← Back to news

ఆర్మీ గన్స్ ఎక్కడికి వెళ్లాయి? జవాన్ల ఫోన్లు సీజ్!

By sahani· 1d ago· Eenadu· Hyderabad
ఆర్మీ గన్స్ ఎక్కడికి వెళ్లాయి? జవాన్ల ఫోన్లు సీజ్!

సోమవారం సికింద్రాబాద్ బోల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆర్మీ గన్స్, తూటాలు దొంగతనం కేసు పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకున్నారు. దొంగలు తాళాలు బ్రేక్ చేసి, గన్స్‌తో పాటు వాటికి సెట్ అయ్యే బుల్లెట్లను మాత్రమే తీసుకెళ్లడంతో లోపలి వ్యక్తుల హ్యాండ్ ఉందనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఆర్మీ సిబ్బందిపై 'హనీట్రాప్' ఏమైనా జరిగిందా అనే అనుమానంతో వారి ఫోన్స్, సోషల్ మీడియా అకౌంట్స్‌ను చెక్ చేస్తున్నారు. కంట్రీ సెక్యూరిటీకి సంబంధించిన ఈ హైప్రొఫైల్ కేసును మిలిటరీ, పోలీసులు ఫాస్ట్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.