పెల్లెట్ గన్ ఫైరింగ్: రూల్స్ బ్రేక్ చేసి కాల్పులు జరిపారు!

ఢిల్లీ ప్రొటెస్ట్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) పెల్లెట్ గన్స్ వాడటంపై వివాదం నడుస్తోంది. జులై 20న నిబంధనలకు విరుద్ధంగా ఏడు రౌండ్ల ఫైరింగ్ జరిగిందని, అందులో స్టూడెంట్‌తో పాటు జర్నలిస్ట్‌కి దెబ్బలు తగిలాయని ఇంటర్నల్ రివ్యూలో తేలింది. దీనిపై RAF ఇన్స్‌పెక్టర్ జనరల్ సీమా ధుండియా స్పందిస్తూ... పద్ధతి ప్రకారం హెచ్చరికలు ఇచ్చిన తర్వాతే లారీఛార్జ్ లేదా కన్నీటివాయువు వాడాలని, పరిమితి దాటి ఫోర్స్ వాడకూడదని జవాన్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.




