పంజాబ్ అసెంబ్లీలో హైడ్రామా: సీఎంకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలన్న కాంగ్రెస్
పంజాబ్ అసెంబ్లీలో మే డే ప్రత్యేక సెషన్ రసాభాసగా మారింది. సీఎం భగవంత్ మాన్ మద్యం మత్తులో సభకు వచ్చారని కాంగ్రెస్, అకాలీదళ్ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా స్పందిస్తూ.. సీఎంకు వెంటనే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలని, అవసరమైతే సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.గతంలో కూడా సీఎంపై ఇలాంటి ఆరోపణలు రావడంతో విపక్షాలు ఈ ఇష్యూను గట్టిగా పట్టుకున్నాయి. స్పీకర్ ఈ డిమాండ్‌ను తిరస్కరించడంతో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.


