వరద నీటిలో ఆందోళన.. గ్రామాలు ముంపులోకి!

పోలవరం జిల్లా చింతూరు మండలం కుయిగూరు, కల్లేరు గ్రామస్తులు శుక్రవారం వరద నీటిలో ఆందోళన చేపట్టారు. ప్రతి ఏడాది వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇళ్లు ఖాళీ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 45.7.2 కాంటూర్‌లో ఉన్న తమ గ్రామాలను 41.15 కాంటూర్‌లో చేర్చి పరిహారం ఇవ్వాలని, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ పీవో శుభం నొక్వాల్ ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.


