కమిషన్ సభ్యుడిని కలిసిన రామగుండం సీపీ

పెద్దపల్లి జిల్లా NTPC జ్యోతి భవన్‌కు విచ్చేసిన జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా కమిషన్ సభ్యుడికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపు మర్యాదపూర్వకంగా సమావేశమైన అనంతరం సీపీ అక్కడి నుంచి వెళ్లారు.



