పటమటలో బ్యానర్లు.. జనసేనలో చేరికపై ప్రచారం

విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధాబాబు జనసేనలో చేరనున్నారంటూ ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పటమట ప్రాంతంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన నాయకులు బ్యానర్లు ఏర్పాటు చేయడం చర్చకు దారితీసింది. ఈ పరిణామంతో రాధాబాబు రాజకీయ అడుగుపై ఆసక్తి పెరిగింది. అయితే జనసేనలో చేరికపై స్పష్టత రావాల్సి ఉంది.


