← Back to news

భారీ వర్షాలు.. ద్రోణి ఎఫెక్ట్

By Krishna· 4h ago· Gov
భారీ వర్షాలు.. ద్రోణి ఎఫెక్ట్

AP, తెలంగాణపై బలమైన ద్రోణి ఉంది. దీని కారణంగా ఇవాళ అక్టోబర్ 17న రెండు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. అక్టోబర్ 22 వరకూ రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడా లైట్ రెయిన్ పడుతుందని IMD అంచనా వేసింది. ఈశాన్య రుతుపవనాల వల్ల గాలిలో తేమ పెరిగి.. వర్షాలు పడే అవకాశాలు మెరుగయ్యాయి. ఐతే, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఎండ కూడా ఉంటుంది. గాలి వేగం గంటకు 15 నుంచి 20 కిలోమీటర్లుగా ఉంటుంది.

More in Current Affairs