← Back to news

క్యాన్సర్ పట్ల అప్రమత్తం..! జడ్జి సూచన

By Pinjari Shiva Kumar· 3d ago
క్యాన్సర్ పట్ల అప్రమత్తం..! జడ్జి సూచన

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ, మాధవి క్యాన్సర్ పై కీలక సూచనలు ఇచ్చారు. మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత న్యాయవాది చాప, కిషోర్ సంతాప సభలో ఆమె పాల్గొని, "క్యాన్సర్ రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి" అని సూచించారు. వ్యాధి వచ్చిన తర్వాత పోరాడే కంటే ముందస్తు పరీక్షలు, అప్రమత్తతే మేలని స్పష్టం చేశారు.క్యాన్సర్ తో తోటి న్యాయవాది మరణించడం తీవ్ర బాధాకరమని, అందుకే ఆమె న్యాయవాదులకు, ప్రజలకు ఈ సందేశం ఇచ్చారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.