కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ పోరుబాట: ధర్మారెడ్డి

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. హనుమకొండ జిల్లా పరకాలలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2న ప్రభుత్వ హామీలు, వైఫల్యాలను వివరిస్తూ ఛార్జ్‌షీట్ విడుదల చేస్తామని చెప్పారు. 3న రైతు సదస్సులు, 5న యువత ర్యాలీలు, 6న సింగరేణి మైన్స్ వద్ద నిరసనలు నిర్వహిస్తామని వెల్లడించారు.



