← Back to news

పోషణ మాసం: బాలల వికాసానికి పౌష్టికాహారం అవసరం

By Appalanaidu· 1d ago· Sunkarametta, Araku Valley, Alluri Sitharama Raju
పోషణ మాసం: బాలల వికాసానికి పౌష్టికాహారం అవసరం

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ మండలం సుంకరమెట్ట పంచాయతీ కేంద్రంలో సోమవారం పోషణ మాసం కార్యక్రమం జరిగింది. సూపర్‌వైజర్ రామకృష్ణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీడీపీఓ లక్ష్మీ లావణ్య, ఎంపీడీఓ ప్రసాద్, ఎంఆర్ఓ రాజా శ్రీధర్, ఎంఈఓ-2 భారతీరత్నం పాల్గొన్నారు. పోషకాహారం, బాలల వికాసంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాతృ వందన పథకం ప్రయోజనాలు పొందాలని, అంగన్‌వాడీ పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ధన, శాంతి, సంగీత పాల్గొన్నారు.

More in Local