మహబూబాబాద్‌లో సెప్టెంబర్ 17న జాబ్ మేళా

మహబూబాబాద్ జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్ 17న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి టి. రజిత తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన VVC గ్రూప్, మహబూబాబాద్‌లోని ఫ్లిప్‌కార్ట్ కంపెనీలో పలు ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన పురుష అభ్యర్థులు ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్, ఆటోమోటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, షోరూమ్ హోస్ట్, డెలివరీ బాయ్ పోస్టులకు హాజరుకావచ్చు.



