← Back to news

బిల్లుల చెల్లింపుల్లో జాప్యం.. సర్పంచుల చెక్ పవర్ రద్దు

By DK· 4h ago
బిల్లుల చెల్లింపుల్లో జాప్యం.. సర్పంచుల చెక్ పవర్ రద్దు

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి, పెంట్లవెల్లి, బిజినపల్లి మండలం కారుకొండ గ్రామాల సర్పంచుల చెక్ పవర్‌ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేయడం, అప్పగించిన అధికారాలను దుర్వినియోగం చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు తెలిపారు. కోడేరు మండలం ఎత్తం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

More in Local