కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలి

వర్షాలు పడక కర్నూలు జిల్లాలో తీవ్రమైన కరువు వచ్చిందని CPM నాయకులు కె. రామాంజనేయులు, పి. రామచంద్రయ్య చెప్పారు. పనులు లేక రైతులు, కౌలు రైతులు, కూలీలు ఊళ్లు వదిలి పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గవర్నమెంట్ వెంటనే స్పందించి కర్నూలును కరువు జిల్లాగా డిక్లేర్ చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఈ నెల 24, 25 తేదీల్లో గ్రామా సచివాలయాల ముందు చేస్తున్న నిరసనలకు ప్రజలంతా సపోర్ట్ చేయాలని పిలుపునిచ్చారు.



