రెండు బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ఖానాపూర్ బ్రిడ్జి వద్ద రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హనుమకొండ నుంచి మహబూబాబాద్ వైపు వెళ్తున్న తేజావత్ పవన్ తో పాటు మరో వ్యక్తికి ప్రమాదంలో గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



