బాపట్ల మున్సిపాలిటీకి రూ.29 కోట్ల నిధులు

బాపట్ల పట్టణంలో రహదారులు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధికి కొత్తగా రూ.29 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మౌలిక వసతుల అభివృద్ధి పథకం కింద ఈ నిధులు మంజూరైనట్లు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ తెలిపారు. ఇప్పటికే అమృత్ పథకం కింద రూ.22 కోట్లు మంజూరయ్యాయని, తాజాగా వచ్చిన నిధులతో కలిపి ఈ ఏడాది బాపట్లకు రూ.50 కోట్లకుపైగా నిధులు సమకూరినట్లు చెప్పారు. మంజూరైన నిధులతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.



