← Back to news

అక్టోబర్ 2 నుంచి కోయ, గోండి భాషాల వర్క్‌షాప్

By DK· 2h ago
అక్టోబర్ 2 నుంచి కోయ, గోండి భాషాల వర్క్‌షాప్

భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అక్టోబర్ 2 నుంచి 6 వరకు జాతీయ స్థాయి కోయ, గోండి భాషాల ప్రామాణీకరణ, డిక్షనరీ వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు. వర్క్‌షాప్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆదివాసీ ప్రతినిధుల సమక్షంలో ఆయన ఆవిష్కరించారు. ఐటీడీఏ ఆతిథ్య సహకారంతో, జాతీయ గోండి కోయ భాషా ప్రామాణీకరణ, డిక్షనరీ మరియు రికగ్నైషన్ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

More in Local