రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం జయలక్ష్మీపురంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు మంగళవారం స్టార్ట్ అయ్యాయి. లబ్ధిదారులు తల్లాడ సుజాత, నల్లగట్ల ప్రమీల, ఇడుపులపాటి మరియమ్మల ఇళ్లకు AE శ్రీనివాస్ మార్కింగ్ (ముగ్గు) వేశారు. గ్రామానికి సెకండ్ ఫేజ్లో 12 ఇళ్లు మంజూరయ్యాయని, మిగతా వారికి కూడా త్వరలోనే మార్కింగ్ ఇస్తామని సర్పంచ్ శ్రీనివాసరావు చెప్పారు. ఈ ప్రోగ్రామ్లో ఉప సర్పంచ్ జయరాజు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.



