← Back to news

జిల్లాల ఏర్పాటు కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం

By Kamal Kumar· 1d ago· Vikarabad, Vikarabad, Vikarabad
జిల్లాల ఏర్పాటు కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం

వికారాబాద్ జిల్లా ఏర్పాటుకు పదేళ్లు పూర్తయిన సందర్భంగా తాండూరు నియోజకవర్గ BRS ఇన్‌ఛార్జ్ శ్రీశైల్ రెడ్డి వికారాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తాలో KCR చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మాజీ MLA పైలట్ రోహిత్‌రెడ్డి పిలుపు మేరకు BRS నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు KCR దూరదృష్టికి నిదర్శనమని శ్రీశైల్ రెడ్డి తెలిపారు. జిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజలకు మరింత చేరువైందని, ప్రభుత్వ సేవలు పొందడం సులభమైందని చెప్పారు.

More in Local