కొడుక్కు కారుందన్న తప్పుడు రికార్డుతో తల్లి పెన్షన్కు ఎసరు

బాపట్లలో రాజారమేష్ తన పేరుపై వాహనం ఉన్నట్లు రికార్డుల్లో ఉందని, దీంతో తల్లి వితంతు పింఛన్ నిలిపివేశారన్నారు. అయితే తన దగ్గర అలాంటి వాహనమే లేదన్నారు. 2020 నుంచి అధికారులకు ఆర్జీలు పెట్టుకుని, ధృవపత్రాలు ఇచ్చినా సమస్యం పరిష్కారం కాలేదన్నారు. సెప్టెంబర్ 15న కలెక్టర్‌కు, 21న PGRSలో మరో అర్జీ ఇచ్చారు. రికార్డులు సరిచేసి తల్లి పింఛన్ పునరుద్ధరించాలని కోరుతున్నారు. మన అధికార యంత్రాంగం మేల్కొంటుందా? ఇందులో నిజానిజాలు తేలుస్తుందా? చూడాలి.



