కరెంట్ వైర్లు తగిలి ట్రాక్టర్ దగ్ధం

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం మోటకట్ల గ్రామం కాకరపల్లి సమీపంలో కరెంట్ వైర్లు తగిలి ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. పశువుల మేతను తరలిస్తుండగా ట్రాక్టర్‌కు విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంజన్‌తో సహా ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.



