సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించాలి

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలోని ఎస్సీ వార్డులో మౌలిక వసతుల కొరతపై కేవీపీఎస్ మండల అధ్యక్షుడు కర్నె వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులో సరైన రోడ్లు, మురుగు కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మురుగునీరు నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగి చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సీసీ రోడ్లు నిర్మించడంతో పాటు మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.



