ఢిల్లీ హోటల్ ఫైర్ యాక్సిడెంట్ లో కంటతడిపెట్టించే ఎమోషనల్ విజువల్స్ !!

ఢిల్లీలోనిFlourish Stay BnB హోటల్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో బాధితులు చనిపోయిన తీరు చాలా పెయిన్ ఫుల్ గా కనిపిస్తోంది. ఒక జంట ఒకరినొకరు హత్తుకుని కాలి బూడిదైపోయారు. మంటలనుంచి తప్పించుకోడానికి వారు గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ వాష్‌రూమ్‌లోకి వెళ్లి తలుపులు లాక్ చేసుకున్నారు. రక్షించడానికి వచ్చిన మహమ్మద్ షోయబ్ అనే వ్యక్తి ఆ తలుపులు బద్దలుకొట్టి చూడగా.. వారు ఒకరినొకరు గట్టిగా హగ్ చేసుకుని చనిపోయారు. మంటల వల్ల కాకుండా, దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక చనిపోయినట్లు సహాయక సిబ్బంది తెలిపారు. మరొక రూమ్ లో ఒక జంట బెడ్ అంచుల్లో కూర్చున్న వారు అదే పొజిషన్ లో కాలిపోయారు.


