← Back to news

కొత్త బల్లి జాతి

By Ramesh· 2h ago· Warangal
కొత్త బల్లి జాతి

వరంగల్ జిల్లా పాకాల అభయారణ్యంలో శాస్త్రవేత్తలు ‘హెమిడాక్టిలస్ కోయాయోరం’ అనే కొత్త రకం బల్లిని కనుగొన్నారు. అక్కడ నివసించే కోయ గిరిజనుల గౌరవార్థం ఈ పేరు పెట్టారు. ఇవి పాకాల నేచర్ ట్రైల్, హరిత రిసార్ట్స్ దగ్గరి బండరాళ్ల కింద కనిపిస్తాయని తెలిపారు. గరిష్ఠంగా 55.6 మి.మీ. పెరిగే ఈ బల్లుల వీపుపై నాలుగు తెల్లటి పూల ఆకారపు మార్క్స్ ఉంటాయి. జెనెటిక్ టెస్టుల ద్వారా ఇది కొత్త స్పెషల్ వెరైటీ అని సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు.

More in TG