హైటెక్ సిటీ భూములకు రైతు భరోసా? ఇదేంటి?

TG: సాగుచేస్తున్న భూములకే "రైతు భరోసా" స్కీమ్ ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కానీ.. గండిపేట మండలం.. కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో వ్యవసాయం చెయ్యని, పూర్తిగా భవనాలు ఉన్న ప్రదేశాల్లో భూములకు కూడా రైతు భరోసా మనీ ఇస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. రికార్డుల్లో ఆ లాండ్స్, వ్యవసాయ భూములుగానే ఉన్నట్లు సమాచారం. లబ్ధిదారుల్లో ఏపీ, తెలంగాణలో సంపన్నులు, VVIPలు ఉన్నారని తెలుస్తోంది. ఆగస్టులో 512 మందికి 30 లక్షలు వచ్చాయని సమాచారం. ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


