రేపు కంగ్టి మండలం సర్వసభ్య సమావేశం

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల రేపు మధ్యాహ్నం రెండు గంటలకు మండల సర్వసభ్య సమావేశం ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు MPDO దయాకర్ రావు తెలిపారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. అధికారులు ప్రగతి ప్రణాళిక పూర్తి నివేదికతో సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఈ సమావేశానికి సర్పంచులు సమయానికి హాజరు కావాలన్నారు.


