డిగ్రీ పరీక్ష ఫీజుకు మరో అవకాశం

మహబూబ్నగర్లోని పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 24 వరకు పొడిగించింది. దసరా సెలవులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ₹.300 ఫైన్తో ఈ నెల 27 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని యూనివర్సిటీ సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులు గడువులోగా ఫీజు చెల్లించాలని సూచించింది.


