ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి

TG: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపి నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో, ఎల్లారెడ్డి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.



