యాక్షన్ సీన్స్ చేయడం అంత తేలిక కాదు!

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తన కెరీర్, నిర్మాణ రంగంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సున్నితంగా ఉండే అమ్మాయి యాక్షన్ సీన్స్ చేస్తుంటే ప్రేక్షకులు ఒప్పుకోవడం అంత తేలిక కాదని, కానీ ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘సిటాడెల్’ సిరీస్‌లలో తన యాక్షన్‌కు మంచి స్పందన వచ్చిందని ఆమె తెలిపారు. అలాగే నిర్మాణం వైపు రావడం వల్ల తనకు నచ్చిన పనులు చేసుకునే స్వేచ్ఛ దక్కిందన్నారు. తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ‘శుభం’, ‘మా ఇంటి బంగారం’ ప్రాజెక్టులు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయని తెలిపారు.



