← Back to news

ఓవర్‌లోడ్‌తో బీర్పూర్ గుట్టపై ఆగిన ఆర్టీసీ బస్సు

By Srikanth Goud· 1d ago· Jagitial, Jagitial, Jagitial

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయి నుంచి జగిత్యాల వస్తున్న ఆర్టీసీ బస్సు బీర్పూర్ గుట్ట ఎక్కుతుండగా ఒక్కసారిగా ఆగిపోయింది. బస్సులో దాదాపు 100 మంది ప్రయాణికులు ఉండటంతో ఓవర్‌లోడ్ కారణంగానే నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులంతా బస్సు దిగి గుట్టపైకి నడుచుకుంటూ వెళ్లారు. గుట్ట ఎక్కిన తర్వాత తిరిగి బస్సులోకి ఎక్కారు. అనంతరం బస్సు జగిత్యాల బస్టాండ్‌కు చేరుకుంది.

More in Local