← Back to news

జగిత్యాల TPRTU అధ్యక్షుడిగా రొట్టె శ్రీనివాస్

By Srikanth· 1d ago· Jagitial, Jagitial, Jagitial
జగిత్యాల TPRTU అధ్యక్షుడిగా రొట్టె శ్రీనివాస్

జగిత్యాల జిల్లా టీపీఆర్టీయూ అధ్యక్షుడిగా రొట్టె శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయన బుగ్గారం మండలం చిన్నాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ హిందీ పండిట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ధర్మపురిలో జరిగిన సమావేశంలో టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆయనకు సభ్యత్వం అందించి బాధ్యతలు అప్పగించారు. పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించి పీఆర్సీ అమలు చేయాలని హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

More in Local