← Back to news

మంచిర్యాల విద్యార్థినికి అరుదైన గౌరవం

By Bala· 1d ago
మంచిర్యాల విద్యార్థినికి అరుదైన గౌరవం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన లసెట్టి శ్వేత ఎస్ఎస్సీ ఫలితాల్లో 582 మార్కులతో జిల్లా ప్రథమ స్థానం సాధించింది. ప్రస్తుతం మహబూబ్‌నగర్ IIITలో మొదటి సంవత్సరం చదువుతున్న శ్వేతకు ‘చదువుకో తెలంగాణ’ కార్యక్రమంలో రూ.2 లక్షల నగదు పురస్కారం, సర్టిఫికెట్ అందించనున్నారు. ఈ నెల 24న హైదరాబాద్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా అవార్డు అందుకోనుంది. శ్వేతను పలువురు అభినందించారు.

More in Local