పాన్ ఇండియా మోజులో హీరోలు: కోన వెంకట్

సినిమాల నిడివి పెరగడం, సరైన ప్రణాళిక లేకపోవడంపై నిర్మాత, రచయిత కోన వెంకట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 3 గంటల 50 నిమిషాల సినిమా తీసి, ఎడిటింగ్‌లో 2 గంటల సన్నివేశాలను తొలగిస్తే నిర్మాతలకు నష్టం కాదా అని ప్రశ్నించారు. అలాంటి దర్శకులను పరిశ్రమ నుంచి తొలగించాలని అన్నారు. పాన్ ఇండియా మోజులో హీరోలు ఏళ్ల తరబడి ఒక్క సినిమాకే పరిమితం కాకుండా, ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తే సినీ కార్మికులకు పని దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.



