భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించాలి
మంచిర్యాల జిల్లా మందమర్రి గర్ల్స్ హైస్కూల్‌లో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో షహీద్ భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు ఆయన త్యాగాలు, జీవిత ఆశయాలను వివరించారు. భగత్ సింగ్ దేశం కోసం చేసిన త్యాగం ప్రతి యువతకు స్ఫూర్తిదాయకమని సొసైటీ సభ్యులు అన్నారు. "ఇంకిలాబ్ జిందాబాద్" నినాదంతో యువతలో దేశభక్తి నింపారని తెలిపారు.



