← Back to news

పౌడర్ ట్యాంక్‌లో పడి కార్మికుడి మృతి.. పోలీసులు కేసు నమోదు!

By Saraswathi· 1d ago· Razole, Razole, Dr. B.R. Ambedkar Konaseema
పౌడర్ ట్యాంక్‌లో పడి కార్మికుడి మృతి.. పోలీసులు కేసు నమోదు!

Dr. B.R. Ambedkar Konaseema జిల్లా రావులపాలెం మండలం ఈతకోటలోని రమ్య ఫుడ్స్ కంపెనీలో బుధవారం సాయంత్రం 6 గంటలకు విషాదం చోటుచేసుకుంది. గంటి గ్రామానికి చెందిన గుత్తుల రాజు (23) అనే యువకుడు పౌడర్ ట్యాంక్‌పై విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయి మృతి చెందాడు. స్థానికులు, సహచరులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.