ఒత్తిడిని జయించాలంటే క్రీడలు అవసరం: DGP

AP: పోలీసు విధుల్లో ఫిట్నెస్‌తో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని DGP హరీష్‌కుమార్ గుప్తా సూచించారు. మంగళగిరిలోని APSP 6వ బెటాలియన్ మైదానంలో ఏపీ పోలీస్ శాఖ తొలిసారిగా నిర్వహిస్తున్న ‘స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026’ను ఆయన ప్రారంభించారు. క్రీడల ద్వారా ఒత్తిడిని అధిగమించడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, సమన్వయంతో పనిచేయడం వంటి లక్షణాలు మెరుగుపడతాయని డీజీపీ పేర్కొన్నారు. ఈ నెల 4 వరకు జరిగే పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,900 మంది పోలీసు క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు.



