← Back to news

నిమజ్జనానికి నెక్లెస్ రోడ్‌లో ఏర్పాట్లు

By CHANPASHA· 3h ago· Musheerabad, Musheerabad, Hyderabad
నిమజ్జనానికి నెక్లెస్ రోడ్‌లో ఏర్పాట్లు

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతిలేదని అధికారులు తెలిపారు. చెరువులు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం GHMC ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ప్రాంతంలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీలు హైకోర్టు ఆదేశాలు, అధికారుల సూచనలు పాటిస్తూ నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రదేశాలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

More in Local