← Back to news

మూడు రాష్ట్రాల్లో అధికార వ్యతిరేకత

By aravinda nyayapati· 4 May 2026· Hyderabad
మూడు రాష్ట్రాల్లో అధికార వ్యతిరేకత

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అధికార వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు ఏ మాత్రం అందకుండా తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే దూసుకుపోతోంది. 100కి పైగా స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇక అధికార డీఎంకే ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. పశ్చిమ బెంగాల్ లో కూడా 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మెజార్టీ స్థానాల దిశగా బీజేపీ దూసుకుపోతోంది. కేరళలో పినరయి విజయన్ కి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం దిశగా దూసుకుపోతోంది.

More in Politics