ఎమర్జెన్సీ ఫండ్.. జాబ్ పోయినా ఇదే మీ సేఫ్టీ!

జాబ్ ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు పెద్ద ఖర్చు వస్తుందో చెప్పలేం. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ చాలా ముఖ్యం. కనీసం 6–12 నెలల అవసరమైన ఖర్చులకు సరిపడా డబ్బు ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నెలకు 40,000 రూపాయలు ఖర్చైతే.. 6 నెలలకు 2.4 లక్షలు, 12 నెలలకు 4.8 లక్షలు కావాలి. రెంట్, ఈఎంఐ, కరెంట్, గ్యాస్, కిరాణా, పిల్లల ఫీజులు, ఇన్సూరెన్స్ లాంటి ఖర్చులు ఇందులో లెక్కించాలి. ఇంట్లో ఒక్కరే సంపాదిస్తే ఇంకా ఎక్కువ బఫర్ ఉంచుకోవడం మంచిది.



