SVBC చైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం
AP: తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో SVBC(Sri Venkateshwara Bhakthi Channel) చైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు వచ్చారు. నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణతోపాటు వారి కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


