← Back to news

రోడ్డు కోసం గ్రామస్తులే రంగంలోకి

By A Kumar· 1h ago· Pedabayalu, Peda Bayalu, Alluri Sitharama Raju

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గోమంగి పంచాయతీ బోయరాజులు గ్రామంలో రహదారి సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే రంగంలోకి దిగారు. రహదారి అధ్వానంగా మారి నిత్యం ఇబ్బందులు పడుతున్నా ఎన్నిసార్లు విన్నవించినా పరిష్కారం లభించలేదని గ్రామస్తులు తెలిపారు. దీంతో ఏకమై పారలు, గడ్డపారలు చేతబట్టి స్వచ్ఛందంగా శ్రమదానం చేపట్టారు. రోడ్డుపై ఉన్న రాళ్లను తొలగిస్తూ, మట్టిని చదును చేస్తూ రాకపోకలకు అనువుగా మార్చుకుంటున్నారు.

More in Local