మంధాన కెప్టెన్సీలో భారత్కు తొలి సిరీస్.. నేటి నుంచే T20

భారత మహిళల క్రికెట్ జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్గా ఎంపికైన స్మృతి మంధాన నేటి నుంచి జింబాబ్వేతో జరిగే T20 సిరీస్లో జట్టును నడిపించనున్నారు. మూడు మ్యాచ్ల సిరీస్ శుక్రవారం రాయ్పూర్లో ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఓపెనర్లు మంధాన, షఫాలీ మంచి ఆరంభం ఇవ్వడంతో పాటు మిడిలార్డర్ బ్యాటర్లు కూడా రాణించాలని భారత్ భావిస్తోంది. బౌలింగ్, ఫీల్డింగ్లోనూ మెరుగ్గా ఆడి సిరీస్ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.



