ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సంచలన కామెంట్స్

TG: తన నియోజకవర్గ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆర్మూర్ BJP ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే రాజీనామా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. 'నిధులన్నీ కొడంగల్, ములుగుకే తీసుకెళ్తున్నారు. సభ చివర్లో నాకు ప్రత్యేకంగా సమయం ఇవ్వాలి అధ్యక్షా. నేను ఇవాళ రాజీనామా చేయాలనుకుంటున్నా' అని తనదైన స్టైల్లో హెచ్చరించారు. దీంతో స్పీకర్ సహా మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు నవ్వుతూ కనిపించారు.


