← Back to news

బ్రిడ్జి దెబ్బతిని లారీ ఇరుక్కుంది

By BK· 1d ago· పార్వతీపురం మన్యం
బ్రిడ్జి దెబ్బతిని లారీ ఇరుక్కుంది

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో మార్కొండపుట్టి నుంచి నంద వెళ్లే దారిలో ఉన్న చిట్టిగెడ్డ వంతెన దెబ్బతిని ఒక లారీ ఇరుక్కుపోయింది. దీంతో దాదాపు 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ వంతెన పాడైపోయిందని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కనీస రిపేర్లు కూడా చేయలేదని గిరిజనులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త వంతెన నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

More in Local