మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది కొరత

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది కొరత కారణంగా విధుల్లో ఉన్న పోలీసులపై పని ఒత్తిడి పెరుగుతోంది. స్టేషన్‌కు సుమారు 100 మంది సిబ్బంది అవసరం ఉండగా, ప్రస్తుతం 30 మందితోనే విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలో జనాభా, వాహనాల రాకపోకలు పెరగడంతో పాటు వివిధ సమస్యలపై నిత్యం ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, నేరాల దర్యాప్తు వంటి బాధ్యతలను పరిమిత సిబ్బందితోనే సమన్వయం చేసుకోవాల్సి వస్తోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



