చెల్పూర్‌లో కంప్యూటర్ ల్యాబ్.! విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యం

కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ మండలం చెల్పూర్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుభవార్త. మంగళవారం ఆ పాఠశాలలో కొత్తగా కంప్యూటర్ ల్యాబ్‌ను MEO శ్రీనివాస్ ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక విద్య అందించేందుకు ఇదొక మంచి అడుగు. అనంతరం ఆయన తరగతి గదులు పరిశీలించి, విద్యార్థుల ప్రగతిని తెలుసుకున్నారు. వారి చదవడం, రాయడం, సంఖ్యా పరిజ్ఞానాన్ని పరీక్షించి, ఉపాధ్యాయులతో చర్చించారు.<br>ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ, "ప్రాథమిక నైపుణ్యాలను చిన్నతనం నుంచే పెంపొందించాలి" అని సూచించారు.



