స్వాతంత్ర్యం నుంచి సామాజిక విప్లవం వరకు 'గోరా' ప్రస్థానం

ఇవాళ ప్రముఖ ఉద్యమకారిణి, స్వాతంత్ర్య సమరయోధురాలు, నాస్తికవాది సరస్వతి గోరా జయంతి. ఆమె 1912లో విజయనగరంలో జన్మించారు. 10 ఏళ్ల వయసులో సామాజికవేత్త గోరా(గోపరాజు రామచంద్రరావు)తో వివాహం జరిగింది. 1940లో కృష్ణా జిల్లా ముదునూరులో నాస్తిక కేంద్రం స్థాపించి, కులవ్యవస్థ, అస్పృశ్యత, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడారు. మహిళా సాధికారత, హేతువాదం, మానవ విలువల కోసం కృషి చేశారు. జమ్నాలాల్ బజాజ్ అవార్డు గ్రహీత. 2006లో ఆమె మరణించారు. ఆమె సేవలు ఇప్పటికీ స్ఫూర్తిదాయకం.



